నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్ (21), చింతల నాని (21) సూర్యలంక బీచ్‌కి వెళ్లారు. అయితే బీచ్ మూసివేయడంతో తిరిగి గుంటూరుకి బయల్దేరారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 2.34 గంటల సమయంలో బాపట్ల గడియారం స్తంభం కూడలి వద్ద చీరాల నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అమాంతం ఎగిరిపడ్డారు. దీంతో అక్కడిక్కడే ఇద్దరు మృతిచెందారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



