- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: భూభారతి చట్టం అమలుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2 నుంచి భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 5 నుంచి 30 వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో సదస్సులు నిర్వహిస్తున్నాం. ఆ అనుభవాలతో జూన్ 2 నుంచి అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహిస్తామన్నారు. నిర్దేశిత గడువులోపు భూభారతి చట్టం పరిధిలోకి వచ్చే ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు.
- Advertisement -