Thursday, November 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచీమల భ‌యం..వివాహిత ఆత్మహత్య

చీమల భ‌యం..వివాహిత ఆత్మహత్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటుచేసుకున్నది. చీమల ఫోబియాతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నది. శర్వా హోమ్స్‌కు చెందిన శ్రీకాంత్‌ భార్య మనీషా (25) చీమల ఫోబియాతో బాధపడుతున్నది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను దవాఖానలో చూపించి, కౌన్సిలింగ్‌ ఇప్పించారు.

అయితే మంగళవారం సాయంత్రం భర్త డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చేసరికి బెడ్‌రూమ్‌కి తలుపు మూసి ఉన్నది. దీంతో స్థానికుల సహకారంతో దానిని తెరిచి, లోపలికి వెళ్లి చూడగా ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘శ్రీ.. ఐయాం సారీ.. ఈ చీమలతో బ్రతకడం నావల్ల కావట్లేదు… కూతురు అన్వి జాగ్రత్త.. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మెుక్కులు తీర్చండి’ అని రాసి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -