డివైఎఫ్ఐ చేస్తున్న ఉద్యమాలకు యువత మద్దతు ఇవ్వాలి.
డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు వర్ధం సైదులు
నవతెలంగాణ – అచ్చంపేట
అందరికీ విద్య అందరికీ ఉపాధి కల్పించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు వర్ధన్ సైదులు అన్నారు. ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ) 46.వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం పట్టణంలోని సిఐటి కార్యాలయం పైన జండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడారు. గత 45 ఏళ్లుగా నిరుద్యోగుల సమస్యల పైన కార్మికులు, కర్షకులకు ఉపాదాని కల్పించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ నిరంతరం పోరాటాలు చేస్తుంది. ఈ పోరాటాలకు యువత ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇవ్వాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకి ఇచ్చిన నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పోరాటం త్యాగం పురోభివృద్ధి లక్ష్యంగా దేశంలో యువత సమగ్ర అభివృద్ధితోపాటు నాందిగా నవంబర్ 1 నుండి 7 వరకు తేదీల్లో పంజాబ్ రాష్ట్రంలో లుధియానా జిల్లాల్లో జరిగిన మొదటి మహాసభల్లో డివైఎఫ్ఐ ఏర్పడిందని వారు వెల్లడించారు. అప్పటినుండి ఇప్పటివరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని చదివిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించాలని డివైఎఫ్ఐ పోరాటం చేస్తుందన్నారు. దేశంలోని అనేక సమస్యలపై నిరంతరం పనిచేస్తుందని, కుల, మత ఉన్మాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ టౌన్ అధ్యక్షులు గిరిబాబు, ఉపాధ్యక్షులు శివ, కమిటీ సభ్యులు సంజు, సాయి, మల్లేష్, వెంకటేష్, రంజిత్ పాల్గొన్నారు.



