నవతెలంగాణ – జన్నారం
మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు మంచి విద్యను అందించాలని, మంచిర్యాల జిల్లా ఏసిఎంఓ లక్ష్మయ్య స్కూల్ కాంప్లెక్స్ ఎస్ ఎస్ సి ఆర్ పి రఘునాథ్ అన్నారు. గురువారం జన్నారం మండలంలోని టీ డబ్ల్యూ పిఎస్ సోనాపూర్ తండా, కోలాంగుడ, గర్ల్స్ ఆశ్రమ స్కూల్స్ కావాలి, పాఠశాలలను జెన్ జ్యోతి గౌరవ దివాస్ అచీవ్మెంట్ ఆక్టివిటీస్ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను సందర్శించారు. ఆయా పాఠశాలల్లో మొక్కలు నాటారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందించే నాణ్యమైన మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. మంచి విద్యను అందించాలని కోరారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పాఠశాలలకు వచ్చే ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
గిరిజన పాఠశాలల్లో నాణ్యమైన భోజనాన్ని అందించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



