Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గెలుపు పక్కా.. మెజారిటీపైనే దృష్టి

గెలుపు పక్కా.. మెజారిటీపైనే దృష్టి

- Advertisement -

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి
నవతెలంగాణ- డిచ్ పల్లి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తత్యమని మెజార్టీపైనే దృష్టి కేంద్రీకరించామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆశ భావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల చెందిన నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో శ్రమిస్తున్నారు. గురువారం ఆయన ఎర్రగడ్డ డివిజన్‌లోని గౌతమ్‌పూరి కాలనీలో విస్తృత పర్యటన నిర్వహించారు.317 బూత్‌ల పరిధిలో ప్రజలను కలుస్తూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాలనీలో ప్రజలతో మాట్లాడిన భూపతిరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ను వివరించారు.

ప్రచారం సందర్భంగా భూపతిరెడ్డి కొబ్బరి బొండాల షాప్ యజమానులతో సరదాగా ముచ్చటించి, కొబ్బరి బొండం తాగుతూ ..“కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి” అంటూ ప్రజలను కోరారు.ప్రతి ఒక్కరు ఈ నెల 11న తమ తమ బూత్‌లలో ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతా రావు, గౌతమ్‌పూరి కాలనీ ఇన్‌చార్జి రవి గౌడ్, సురేష్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్పు గంగారెడ్డి, మాజీ జడ్పీటీసీ మోహన్, మాజీ ఎంపిటీసీ శంకర్, కాలనీ అధ్యక్షులు సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -