Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజార్టీతో గెలిపించాలి..

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజార్టీతో గెలిపించాలి..

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కొరకు సుల్తాన్ నగర్ డివిజన్ లో తిమ్మాజిపేట మండల సీనియర్ నాయకులు వివేక్ రెడ్డి ముబారక్ మదవులు ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూపీ నగర్ 391 బూత్ లలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన సంక్షేమ పథకాలు గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం, 500లకే గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని ప్రజలకి వివరించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని, నియోజకవర్గ ప్రజలందరూ కూడా నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  కార్యకర్తలు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -