– నవతెలంగాణ కథనంతో మరమ్మత్తులకు నోచుకున్న జాతీయ రహదారి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని గాంధీనగర్ వద్ద 63 నెంబర్ జాతీయ దారిపై ఏర్పడ్డ గుంతల్ని రోడ్లు భవనాల శాఖ అధికారులు బుధవారం పూడిపించారు. దారుణంగా పాడైన జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన పలు ప్రమాదాల నేపథ్యంలో నవతెలంగాణలో జాతీయ రహదారిపై గుంతల ప్రయాణం శీర్షికతో కథనం పచురుతమైంది. దీనికి స్పందించి స్థానిక అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో యువకులు ఆందోళనకు పూనుకున్నారు. విషయం తెలిసిన రోడ్లు భవనాల శాఖ అధికారులు అప్పటికప్పుడు గుంతల్ని సిమెంట్ కంకరతో పూడిపించారు. వారం పది రోజుల్లో పూడిపించిన గుంతలపై బీటీ ప్యాచ్ వర్క్ చేస్తామని అధికారులు హామీలు ఇచ్చారు. అందులో భాగంగా రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది గాంధీనగర్ సమీపంలో జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతల్ని బీటీ నింపి ప్యాచ్ వర్క్ చేశారు. ఎట్టకేలకు జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతల్ని పూడ్చివేసి బీటీతో ప్యాచ్ వర్క్ చేయడం పట్ల గాంధీనగర్ ప్రజలతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్యాచ్ వర్క్ పనులను స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, సభ్యులు పరిశీలించారు.
జాతీయ రహదారిపై బీటీ ప్యాచ్ వర్క్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



