గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాల జిల్లా కార్యదర్శి ఊరి బండి శ్రీనివాస్ యాదవ్న
నవతెలంగాణ – మిర్యాలగూడ
చనిపోయిన గొర్రెలకు ప్రభుత్వం ఎక్సిగ్రేషియా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాల జిల్లా కార్యదర్శి ఉరీ బండి శ్రీనివాస యాదవ్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అన్నారం అనంతరం దోస్పాడు గ్రామాలకు చెందిన ఆవుల కోటయ్య ఉప్పునూతల సైదులు వెంకన్న శ్రీరాములు కు చెందిన గొర్రెలు మేపుకుంటూ వేములపల్లి మండల కేంద్రానికి వచ్చి మేత మేస్తున్న సందర్భంలో విష ఆహారం తిని 140 గొర్రెలు చనిపోయినాయన్నారు. ఇంకా 200 గొర్రెలు చనిపోయే పరిస్థితిలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే వారికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వము వెంటనే ఎక్స్గ్రేషియా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
చనిపోయిన గొర్రెలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



