Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు చెస్ బోర్డుల పంపిణీ

విద్యార్థులకు చెస్ బోర్డుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మల్దకల్
పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరమ్ ఆధ్వర్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్తులకు చెస్ బోర్డులు గురువారం పటేల్ ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలలో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. చెస్ బోర్డులు అందియడంలో ఎన్నారై ఫోరం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చెస్ పోటీలో తెలివి తేటలు వెలికి తీసే ఆటగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి జి. సురేష్, ఎంపీపీ రాజరెడ్డి, కాంతమ్మ, మహిపాల్ రెడ్డి, సంజీవ రెడ్డి, అనిమి రెడ్డి, జి హెచ్ ఎం ఓబులేష్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,  ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -