స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ లు విద్యార్థుల హక్కు
ఎస్ ఎఫ్ ఐ అధ్వర్యంలో నిరసన
ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు జగన్ కుర్ర సైదా నాయక్
నవతెలంగాణ – మిర్యాలగూడ
స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ లు విద్యార్థుల హక్కు అని విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జగన్, కుర్ర, సైదా నాయక్ ఆరోపించారు. గురువారం ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చర్చి బజార్ అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల పైన ఉన్న శ్రద్ధ విద్యార్థుల పైన ఎందుకు లేదని ప్రశ్నించారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మీ పిల్లలకు ఉన్నతమైన చదువులను అందిస్తానని హామీలు ఇస్తూ ,ప్రస్తుతం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సర్టిఫికెట్లు ఇవ్వమని అడిగితే రియంబర్స్మెంట్ కట్టాలని విద్యార్థులను యాజమాన్యం వేధిస్తున్నారవి చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పునే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదన్నారు. బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు వీరన్న, డివిజన్ కమిటీ సభ్యులు బన్నీ, సిపాయి, సాయి, రాకేష్, దేవా, సంజయ్, హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



