Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయాలి

 విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయాలి

- Advertisement -

డీఎస్పీ రాజశేఖర్ రాజు         
నవతెలంగాణ- మిర్యాలగూడ 

విద్యార్థులు చదువుతోపాటు శారీరక దారుడ్యం, స్నేహ సంబంధాలు పెంపొందించే క్రీడలలో నైపుణ్యాలు పెంపొందిoచుకోవాలని మిర్యాలగూడ డిఎస్పీ కే. రాజశేఖర్ రాజు అన్నారు. మండలంలోని శ్రీనివాస్ నగర్  లో నిర్వహిస్తున్న బీసీ గురుకుల పాఠశాల బాలికల అండర్ 17 జిల్లా స్థాయి క్రీడలను నల్గొండ బీసీ గురుకుల ప్రాంతీయ సమన్వయకర్త ఈ స్వప్న తో కలిసి ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 14బిసి గురుకుల పాఠశాలలో ఆయా విభాగాలకు చెందిన బాలికలు వివిధ క్రీడాంశాలలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా విద్యార్థులు చదువుకొని తల్లిదండ్రులు గురువులతో పాటు సమాజానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థి దశలోనే జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాకారం చేసేందుకు అంకుఠి త దీక్షతో కృషి చేయాలన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటమిన్ సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. క్రీడలకు ప్రారంభం రోజు వాలీబాల్, కబడ్డీ క్రీడలలో దామరచర్ల జట్లు గెలిచారు. ఈ కార్యక్రమంలో దామరచర్ల, అవంతిపురం, వేంపాడు గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్ ఉమాదేవి, రాజశేఖర్, నవీన్ కుమార్, పి డీలు శ్రీనివాసరావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -