నవతెలంగాణ-ధర్మసాగర్
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు,క్రమశిక్షణను పెంపొందిస్తాయని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని కరుణపురం గ్రామంలో స్టేషన్ ఘనపూర్ మహాత్మా జ్యోతిబా పూలె బిసి బాలుర గురుకుల పాఠశాలలో డిస్ట్రిక్ట్ లెవల్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ ప్రారంబొత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అత్యధిక గురుకుల పాఠశాలలతో పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య,కార్పొరేట్ విద్యార్థులతో పోటీపడే విధంగా అందిస్తున్నామన్నారు. గురుకులాల బలోపేతానికి నియోజకవర్గానికి ఒక యాంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు అందిస్తున్నామన్నారు. విద్యా ప్రాముఖ్యతను ప్రతీ ఒక్కరూ గుర్తించి,ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యార్థులకు విద్యా బోధన చేయాలని సూచించారు. చదువుకు ఏదీ అడ్డుకాదను, విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని కష్టపడి చదవాలి గురుకులాల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్సీవో రాజ్ కుమార్, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, పీఈటీలు, విద్యార్థులు, క్రీడాకారులు, ఇతర అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు, క్రమశిక్షణను పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే కడియం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



