Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్9న న్యాయ సేవాధికార దినోత్సవం

9న న్యాయ సేవాధికార దినోత్సవం

- Advertisement -

 జిల్లా సీనియర్ సివిల్ జడ్జి వి రజిని 
నవతెలంగాణ – వనపర్తి  

నవంబర్ 9వ తేదీన న్యాయ సేవాధికార దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా కోర్టు ఆవరణంలో అవగాహన సదస్సుతో పాటు ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా సీనియల్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కోర్టు ప్రాంగణం నుండి ర్యాలీ బయలుదేరి బస్టాండ్ కూడలి నుండి తిరిగి కోర్టు ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతోందన్నారు. అనంతరం కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికరత పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీ, అవగాహన సదస్సులో బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు పోలీస్ సిబ్బంది, పోలీస్ అధికారులు, మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -