– కాలం చెల్లిన పానీయాలు విక్రయించిన బెంగళూరు బేకరీ
– 10 వేల జరిమానా
– మళ్లీ తప్పిదం చేస్తే లైసెన్సు రద్దు
నవతెలంగాణ-రాయికల్:
నవతెలంగాణ దినపత్రిక ద్వారా ఇటీవల వెలుగులోకి వచ్చిన బెంగళూరు బేకరీ, కేక్ హౌస్ లో కాలం చెల్లిన పానీయాల విక్రయం అంశంపై పురపాలక సంఘం చురుగ్గా స్పందించింది.గాంధీచౌక్ వద్ద గల ఆ బేకరీపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకున్నారు.సానిటేషన్ విభాగ సిబ్బంది అక్టోబర్ 31నషాపును సీజ్ చేసి,యజమాని షకీర్‌పై రూ.10వేలు జరిమానా విధించారు. అనంతరం యజమాని తప్పిదాన్ని అంగీకరించడంతో,భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ…మళ్లీ ఇలాంటి ఉల్లంఘన జరిగితే తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 ప్రకారం షాప్ లైసెన్సు రద్దు చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.



