నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో ఉన్న ఇండ్ల నష్టపరిహారం త్వరగా ఇప్పించాలని, నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. త్వరగా వస్తే నూతన ఆర్ అండ్ ఆర్ కాలనిలో ఇండ్లు నిర్మించుకుంటామని, నూతన కాలనిలో ప్రభుత్వ భవనాలు ప్రాధమిక, ఉన్నత పాఠశాల భవనాలు గ్రామపంచాయతీ భవనం ,అంగన్వాడీ భవనాలు త్వరగా నిర్మించాలని, కాలనిలో రోడ్లు, మంచినీటి వ్యవస్థ డ్రైనేజీ,వీధి లైట్లు,త్వరగా ఏర్పాటు చేయలనికోరారు.సెక్టార్ 1కి 1-28 గుంటల భూమిని ప్రయివేటు రైతుల వద్ద సేకరించి రోడ్డు సౌకర్యం కల్పించి అందులో ఉన్న 8 మంది నిర్వాసితులకు ప్లాట్లు ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ సమస్యలు అన్నింటిపై తక్షణమే వివిధ అధికారులకు ఫోన్ చేసి ముందుగా ఆర్ అండ్ ఆర్ కాలనిలో మౌళికవతులు,నల్లాలు, డ్రైనేజీ,వీధి దీపాలు,తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇండ్ల నష్టపరిహారం కోసం కూడా ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతున్నని,నష్టపరిహారం సాధ్యమైనంత త్వరగా చెల్లించే విదంగా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిన్నం రాజు, మాజీ ఎంపిటిసి ఉడుత ఆంజనేయులు,మాజీ ఉపసర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి,మాజీ సర్పంచ్ రావుల నందు,మాజీ ఎంపిటిసి జిన్న మల్లేశం,పిన్నం శ్రీశైలం, మాజీ వార్డు సభ్యులు వళ్ళందస్ గండయ్య, మాజీ హై స్కూల్ చైర్మన్ దంతురి నర్సింహ,రావుల శ్రీను, మాజీ వార్డు సభ్యులు వళ్ళందస్ పరమేష్,రచ్చ మార్కండేయ,రావుల మహిపాల్ పిన్నం గణేష్ దంతురి భాను గ్రామ నిర్వాసితులు పాల్గొన్నారు.


