Friday, November 7, 2025
E-PAPER
Homeకరీంనగర్పోలీస్ నార్కోటిక్ జాగిలాలతో ఆకస్మిక తనిఖీలు

పోలీస్ నార్కోటిక్ జాగిలాలతో ఆకస్మిక తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణ పరిధిలోని పాన్ షాపులు, లాడ్జీలలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది నార్కోటిక్ జాగిలాలతో ఆకస్మిక విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో గంజాయి లాంటి పదార్థాల నిర్ములనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని,టాస్క్ఫోర్స్ సిబ్బంది మత్తు పదార్థాలను గుర్తించే నార్కోటిక్ జాగిలలతో తరచు జిల్లా పరిధిలో ఉన్న లాడ్జిలలో,పాన్ షాప్,కిరాణా షాప్ లలో,బస్టాండ్ ప్రాంతాల్లో,రద్దీగల ప్రాంతాల్లో  విస్తృత తనిఖీలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలకి మత్తు పదార్థాల వల్ల కలుగు ఆనార్ధాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారుజిల్లాలో గంజాయి రవాణా చేసిన,అమ్మిన,సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నిషేధించిన గంజాయి లాంటి మత్తు పదార్థాల సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -