
నవ తెలంగాణ, గాంధారి :
గాంధారి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ మాట్లాడుతూగాంధారి గ్రామంలో రేపు అనగా 01-10-2023 ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి రేపు మన గాంధారి గ్రామంలో ఒకగంట పాటు శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కావున గ్రామస్తులు ముఖ్యంగా యువత ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని గాంధారి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి సహకరిస్తారని సర్పంచ్ గ్రామ ప్రజలు కోరారు