కూతురు జాగ్రత్త అంటూ సూసైడ్ నోట్
నవతెలంగాణ-అమీన్‌పూర్
ఈ చీమలు నన్ను బతకనివవ్వు.. నేను వెళ్లిపో తున్నా..పాపను బాగా చూసుకోండి అంటూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించి గురువారం అమీన్‌పూర్ సీఐ నరేశ్ అప్పగించిన సీఎం, ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలనీ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని చెందిన చిందం శ్రీకాంత్, మనీషా(25) దంపతులు, వారి మూడేండ్ల పాప అనికాతో కలిసి అమీన్‌పూర్ మున్సిపాల్ పరిధిలో నవ్య కాలనీలో రెండేండ్ల నుంచి నివాసముంటున్నారు. అయితే, మనీషా చిన్నప్పటి నుంచి చీమలకు భయపడే మైర్మెకోఫోబియా అనే వ్యాధితో బాధపడుతుంది.
ఈ నెల 4వ తేదీ సాయంత్రం శ్రీకాంత్ డ్యూటీకి వెళ్లాక.. మనీషా ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాంత్ ఇంటికి వచ్చేసరికి బెడ్ రూమ్ డోర్ పెట్టి ఉంది. ఎంత పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడంతో స్థానికుల సహకారంతో డోర్ తెరిచారు. మనీషా ఉరేసుకుని కనిపించింది. అదే రూమ్‌లో నోట్ బుక్ లో ‘శ్రీ చీమలతో బతకడం నా వల్ల కావట్లేదు.. కూతురు అన్వి(4) జాగ్రత్త’ అని రాసిపెట్టి ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదే హాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని స్వస్థలం మంచిర్యాలకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అమీన్‌పూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



