Friday, November 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజావ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు

ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు

- Advertisement -

నవంబర్‌ 26న జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌


నవతెలంగాణ-మహబూబాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు, కర్షకులు ఐక్యంగా పోరాడాలని సీఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ పిలుపునిచ్చారు. సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రదర్శనలను విజయవంతం చేయాలని కోరారు. మహబుబాబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం సీఐటీయూ అధ్యక్షులు ఆకుల రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆఫీసు బేరర్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం లేబర్‌కోడ్‌లు తెచ్చి శ్రమదోపిడీకి పాల్పడుతోందని, పంటలకు గిట్టు బాటు ధరలు చెల్లించకుండా రైతాంగాన్ని మోసగిం చిందని అన్నారు. ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచి బడ్జెట్‌లో నిధులు తగ్గించిందని విమర్శిం చారు. కార్మికులకు కనీస వేతనాలు, సౌకర్యాలు అమలు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ పనిదినాలు పెంచాలని డిమాండ్‌ చేశారు.

బీజేపీ ప్రభుత్వం మతోన్మాద శక్తులకు, బడా కార్పొరేట్‌ సంస్థల యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. శ్రామికవర్గ వ్యతిరేక విధానాలపై రానున్న కాలంలో మరిన్ని ఐక్య పోరాటాలకు కార్మికులు, కర్షకులు సిద్ధం కావాలని చెప్పారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం లేబర్‌ కోడ్‌లను దోడ్డిదారిన అమలు పరిచేందుకు నూతనంగా ”శ్రమశక్తి నీతి 2025” పేరుతో లేబర్‌ పాలసీ ప్రకటించిందని తెలిపారు. ”కేంద్ర ప్రభుత్వ లేబర్‌ పాలసీ – కార్మిక వర్గంపై ప్రభావం” అనే అంశంపై నేడు(శుక్రవారం) జిల్లా కేంద్రంలోని జగన్నాథం భవనంలో సెమినార్‌ జరుగుతుందని తెలిపారు. ఈ సెమినార్‌లో సీఐటీయూ జాతీయ కోశాధికారి యం.సాయిబాబు పాల్గొంటారని, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, జిల్లా ఆఫీసు బేరర్స్‌ కందునూరి శ్రీనివాస్‌, సమ్మెట రాజమౌళి, దుండి వీరన్న, కుమ్మరికుంట్ల నాగన్న, పోతుగంటి మల్లయ్య, చింతా మౌనిక, ధార స్నేహబిందు, ఏసుమళ్ళ సంపూర్ణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -