- Advertisement -
న్యూఢిల్లీ: బ్యాంక్‌ల మోసం, మనీలాండరింగ్‌కు పాల్పడిన రిలయన్స్ గ్రూపు చైర్మెన్ అనిల్ అంబానీపై విచారణను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత వేగవంతం చేసింది. నవంబర్ 14న విచారణకు తమ ఆఫీసుకు రావాలని అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. బ్యాంకు మోసం కేసు, మనీలాండరింగ్ ఆరోపణలపై విచారించనున్నట్టు తెలిపింది. ఈ దఫా ఎస్బీఐకి రుణం ఎగవేత, ఆ నిధుల మళ్ళింపునకు సంబంధించిన మనీలాండరింగ్‌పై ప్రశ్నించనుంది. అనిల్ అంబానీ దాదాపు రూ.17వేల కోట్ల రుణ మోసాలకు పాల్పడినట్టు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ గ్రూపునకు చెందిన రూ.7,500 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
- Advertisement -



