- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతల ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. ఈ విషయంపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎన్నికల సమయంలో సోదాలు సహజమని, ఎవరి ఇంట్లోనైనా అధికారులు తనిఖీలు చేస్తారని తెలిపారు. ఎన్నికల సంఘం పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ పనిచేస్తుందని, ఎవరిపైనైనా ఫిర్యాదులు వస్తే సోదాలు చేయడం ఎన్నికల సంఘం హక్కు అని పేర్కొన్నారు. ప్రతిదాన్ని రాజకీయం చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటైందని విమర్శించారు.
- Advertisement -



