Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలి 

బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి పెంచడానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం నుండి అష్టాంగ ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మ జ్యోతిబాపూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌన దీక్షలు చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఆ పిలుపులో భాగంగా  నిజామాబాద్ నగరం హనుమాన్ జంక్షన్ విగ్రహాల పార్కులో గల మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం వద్ద నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మౌనదీక్ష చేపట్టారు. బీసీలకు న్యాయంగా దక్కవలసిన వాటా దక్కే వరకు పోరాటం ఆపేది లేదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు సత్య ప్రకాష్ కరిపే రవీందర్ దర్శనం దేవేందర్ కొయ్యడ శంకర్ బగ్గలి అజయ్ చంద్రమోహన్ శ్రీలత చంద్రకాంత్ సదానంద్ ఆర్టీసీ శ్రీనివాస్ తంగళ్ళపల్లి శ్రీనివాస్ ఓంకార్ మురళి దయానంద్ ప్రసాద్ నరేష్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -