నవతెలంగాణ – జక్రాన్ పల్లి
గత నెల 29న సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్ధపల్లి క్రీడా మైదానంలో జరిగిన జిల్లా సాఫ్ట్ బాల్ సీనియర్ మహిళల జట్టు ఎంపికలో జక్రాన్ పల్లి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థిని ఆర్ గంగోత్రి పాల్గొని చక్కని ప్రతిభగనపరిచి జిల్లా జట్టుకు ఎంపికైంది. ఈనెల 7 నుండి 9 వరకు గీత విద్యాలయం క్రీడామైదానం జగిత్యాలలో జరిగే రాష్ట్ర 12వ సీనియర్ సాప్ట్ బాల్ పోటీలలో పాల్గొంటున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారుని గంగోత్రిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్, తొర్లికొండ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్, కార్యదర్శి చిక్కాల భూమేశ్వర్, పాఠశాల ఉపాధ్యాయులు రామకృష్ణ, సునీత, మాలతి, కృష్ణ, గౌతమి మరియు ఓఎస్ శేఖర్ లు అభినందించారు. ఈ సందర్భంగా విడిసి అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్, మాట్లాడుతూ గ్రామం నుండి రాష్ట్ర పోటీలలో పాల్గొన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరింతమంది క్రీడాకారులు రాణించేలా ప్రోత్సహిస్తామన్నారు.
రాష్ట్ర సీనియర్ మహిళల సాఫ్ట్ బాల్ పోటీలకు తొర్లికొండ క్రీడాకారిణి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



