Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు అధికారుల అవగాహన

ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు అధికారుల అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన ఇంటి నిర్మాణాల నిర్మించుకునేందుకు లబ్ధిదారులకు జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్, గ్రామ కార్యదర్శులు అవగాహన పరుస్తూ ప్రోత్సహించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద గుల్లా, చిన్న ఏడ్గి , జిపి గ్రామాలలో అధికారులు పర్యటించారు. అదేవిధంగా నేరుగా లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు నిర్మించుకోవడానికి ఎదురవుతున్న సమస్యలను లబ్దిదారులు అధికారులకు విన్నవించారు. ఈ క్రమంలో లబ్దిదారులకు అధికారులు కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు గ్రామ పెద్దలు,  ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -