Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టిబి, ఎయిడ్స్ సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించిన అధికారులు

టిబి, ఎయిడ్స్ సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించిన అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
వందే మాతరం జాతీయ గీతాన్ని మహాకవి శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో నవంబర్ 7వ వరకు ఉదయం 10 గంటలకు వందేమాతరం గీతాన్ని ఆలపించాలని చీఫ్ సీక్రెటరీ అఫ్ గవర్నమెంట్ ఉత్తర్వులు చేశారు. ఈ క్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డాక్టర్ రాజశ్రీ ఆదేశాలతో నిజామాబాద్ జిల్లా టిబి నియంత్రణ కార్యాలయంలో శుక్రవారం టిబి, ఎయిడ్స్ సిబ్బంది కలిసి గీతాన్ని శుక్రవారం ఆలపించారు. ఇలా దేశ భక్తి గీతాన్ని పాడుతూ సిబ్బంది సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో టిబి అధికారిణి డాక్టర్ అవంతి, ఈ ఆర్ టి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సంతోష్, జిల్లా టిబి, హె చ్ ఐ వి కోఆర్డినేటర్ రవిగౌడ్, స్వచ్చంద సంస్థలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -