మత్స్యకారులకు రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి
టీఎంకెఎంకెఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా
నవతెలంగాణ- తలకొండపల్ల
ఈ నెల 18న కడ్తాల్ మండల కేంద్రంలో నిర్వహించే మత్స్య కార్మిక సంఘం జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని టీఎంకెఎంకెఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని విలేకరులతో సమావేశం చేసి ఈ సందర్భంగా టీఎంకెఎంకెఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా మాట్లాడుతున్న కడ్తాల్ మండలం లోని మక్త మాదారం యాట నర్సింహా పంక్షన్ హల్ లో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలకు అఖిల భారత మత్స్యకారులు మత్స్య కార్మిక సమాఖ్య జాతీయ కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, కార్యదర్శి అమన్ గల్ మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత నర్సింహా, గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్, రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు పాల్గొంటారని. మత్స్యకారుల కోసం ప్రభుత్వం రూ.5వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రతీ మత్స్య సొసైటీ బ్యాంకు అకౌంట్లలో రూ.10 లక్షల నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నవంబర్ ఈనెల వచ్చిన ఇప్పటికీ చేప పిల్లలు ఇవ్వకపోవడం సరైంది కాదని విమర్శించారు.
వెంటనే చేప పిల్లలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రూ.8 లక్షల కుటుంబాలు, దేశంలో రూ.3 కోట్ల కుటుంబాలు మత్స్య వృత్తిపై ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుండి మత్స్యకార సంఘం నాయకులు, మత్స్యకారులు ప్రతినిధులు, హాజరవుతారని జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు తరలి రావాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం గత 25 సం.రాల సుదీర్ఘ పోరాటాల అనుభవాలు, చరిత్ర కలిగిన సంఘం, ఉమ్మడి రాష్ట్రంలో నుండే మత్యకారుల సమస్యలపై అనేక రాజీలేని పోరాటాలను నిర్వహించింది. మత్స్యకారులకు రూ.6 లక్షల ఎక్స్ గ్రేషియో, నాణ్యమైన ఉచిత చెప పిల్లలు ఇవ్వాలని గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను మత్స్యశాఖ పరిధిలోనికి తేవాలని ప్రతి మత్స్యకారుడికి ద్విచక్ర వాహనాలు, మొబైల్ మార్కెటింగ్ వాహనాలు ఇవ్వాలని అధికంగా పెంచిన చెరువులు కుంటలు లీజులను తగ్గించాలని, కబ్జాలకు గురవుతున్నా చెరువులు కుంటలపై అనేక రాజీలేని పోరాటాలు చేసి సాధించింది.
కోహెడలో చేపల మార్కెట్ కోసం 10 ఎకరాల భూమి కేటాయించే విధంగా మన సంఘం ప్రధాన కృషి చేసింది. చేరువులు కుంటల్లో కెమికల్ కలిసిన నీటితో చేపలు చనిపోతే పోరాటం చేసి కంపెనీ మూసి వెయి చిందని అన్నారు.జిల్లలో ఇప్పటికి ఉచిత చేప పిల్లలు పంపిణి చేయలేదని టెండర్ల పేరుతో కాలయాపన చేయడం సరైంది కాదని విమర్శించారు వెంటనే చేప పిల్లలు పంపిణి చేయాలనీ లేదంటే సొసైటీల అకౌంట్స్ లలో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా అనేక హక్కులు కోసం పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు.ఈ నెల 18న కడ్తాల్ మండల కేంద్రలో మత్స్యకారుల జిల్లా మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలం కన్వీనర్ బాల కిష్టయ్య, కో కన్వీనర్ ఎస్, వెంకటయ్య, గౌరయ్య తదితరులు పాల్గొన్నారు.



