నవతెలంగాణ – కంఠేశ్వర్
మెడికవర్ హాస్పిటల్, నిజామాబాద్‌లో 47 ఏళ్ల వయసుగల చిన్నులు అనే రోగికి అరుదైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామనిన్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య తెలిపారు. శుక్రవారం మెడికవర్ హాస్పిటల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత కొంతకాలంగా చిన్నులు కి తీవ్రమైన వెన్నునొప్పి, కాళ్లలో నిస్పృహ, చేతులలో నిస్పృహ నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వివిధ ఆస్పత్రిలలో తిరిగిన సాధారణ చికిస్తలతో ఉపశమనం లేకపోవడంతో, మెడికవర్ హాస్పిటల్ న్యూరో విభాగాన్ని సంప్రదించారు. పరిశీలనలో వెన్నెముకలో నరాలపై ఒత్తిడి (స్పైనల్ కంప్రెషన్) ఉందని గుర్తించి, శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ణయించారు.
ఆధునిక సాంకేతిక పద్ధతులు, న్యూరో మానిటరింగ్ సదుపాయాలతో, డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు పేషెంట్ నీ నడిపించడం జరిగింది. ప్రస్తుతం రోగి ఆరోగ్యం సక్రమంగా ఉంది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. వెన్నెముక సమస్యలు వయస్సుతో పెరుగుతుంటాయి. కానీ సకాలంలో గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా కోలుకోవచ్చు. ఆధునిక టెక్నాలజీ వల్ల ఇప్పుడు క్లిష్టమైన న్యూరో సర్జరీలు కూడా సులభంగా చేయగలుగుతున్నాం అని తెలిపారు. ఈ శస్త్రచికిత్సను ప్రసిద్ధ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య నిపుణుల బృందంతో కలిసి పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యజ్ఞ, సెంటర్ హెడ్ స్వామి, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్, పాల్గొన్నారు.



