- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదుతో పాటు ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది. క్రికెటర్ శ్రీచరణి ఇవాళ ఉదయం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘అందరి అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబం నుంచి నాకు చక్కటి ప్రోత్సాహం ఉంది. మా మామ నన్ను క్రికెట్ ఆడించేవారు. నేను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో శిక్షణ పొందాను. ఇది మొదటి అడుగు మాత్రమే.. ముందు చాలా ఉంది. ప్రధాని మోదీని కలిసినప్పుడు భవిష్యత్ కార్యాచరణపై సలహాలిచ్చారు’’ అని అన్నారు.
- Advertisement -



