Saturday, November 8, 2025
E-PAPER
Homeక్రైమ్వీధి కుక్కల దాడిలో 15 గొర్రెపిల్లల మృత్యువాత 

వీధి కుక్కల దాడిలో 15 గొర్రెపిల్లల మృత్యువాత 

- Advertisement -

నవతెలంగాణ – ఉట్కూర్
వీధి కుక్కలు కాటు వేయడంతో 15 గొర్రెల పిల్లలు మృత్యువాత పడ్డ ఘటన శుక్రవారం సాయంత్రం మండల కేంద్రమైన ఊట్కూర్ సమీపంలో చోటుచేసుకుంది. బాధితుడు గుర్రపుల్ల మహేష్ పశు వైద్య సిబ్బంది ఎల్ ఎస్ఎ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్కూర్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గూరపోల్లా మహేష్ గొర్రెల కాపరి ఇడ్లూర్ రహదారికి తమ గొర్రెపిల్లలను పాకలో ఉంచి తమ గొర్రెలను మేపడానికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అయితే ఎవరు లేని సమయంలో పాకలో ఉన్న గొర్రెపిల్లలపై వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో దాదాపు 15 గొర్రె పిల్లలు మృత్యువాత పడ్దాయని వారు తెలిపారు. వీటి విలువ దాదాపుగా రూ. 70,000 వేల నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరి గుర్రపుల్ల మహేష్ వాపోయాడు. ఇంకా 8 గొర్రె పిల్లలు ఎక్కడ కనబడుట లేదని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి పశువైద్య సిబ్బంది ఎల్ ఎస్ ఎ ఆంజనేయులు చేరుకుని మృత్యువాత పడ్డ గొర్రె పిల్లలను పరిశీలించారు. ఈ అదేవిధంగా తీవ్రంగా గాయపడ్డ మూడు గొర్రె పిల్లలకు చికిత్స చేయడం జరిగిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -