నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ జిల్లాలో నేడు ఉద్యాన శాఖ ఆధ్వర్యం లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఆయిల్ పామ్ సాగు పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పై ప్రభుత్వం ఇచ్చే భరోసాల గురించి మరియు సబ్సిడీల గురించి వ్యవసాయ సంఘం సెక్రెటరీస్ తో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే Preunique కంపెనీ వారు 650 టన్నుల ఆయిల్ పామ్ గెలలను కొనుగోలు చేసి 80 లక్షల రూపాయలను రైతులకు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఆయిల్ పామ్ లో ఉండే లాభాలను, కొనుగోలు పద్ధతిని, buy-back అగ్రిమెంట్ విధానాన్ని గురించి తెలిపారు.
ఈ సదస్సుకు విచ్చేసినవారు జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు, జిల్లా వ్యవసాయ శాఖ అధ్యక్షులు గోవింద్ గారు, ఉద్యాన అధికారులు మరియు Preunique కంపెనీ స్టాఫ్ హాజరయ్యారు.



