Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: ఎంపీడీవో వేదవతి 

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి: ఎంపీడీవో వేదవతి 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేసుకునేందుకు అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఎంపీడీవో వర్కల వేదవతి ఆదేశించారు. శుక్రవారం మండలంలోని తీగారం గ్రామాన్ని సందర్శించి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వేదవతి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు మొదటి విడతలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని తెలిపారు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతిని సాధించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసి గృహప్రవేశాలకు ముహూర్తాలు ఖరారు చేసుకోవాలని తెలిపారు. అనంతరం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను సందర్శించి పరిశీలించారు.

విద్యార్థులతో ఆంగ్ల పాఠ్యాంశాన్ని చదివిస్తూ విద్యార్థిని విద్యార్థుల పట్టణ సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. విద్యార్థిని విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను కనబరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. త్రాగునీటి సమస్య పరిష్కారంతోపాటు వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి టీచర్ ను, ఆయాను నియమించేందుకు చర్యలు చేపట్టాలని, అప్పటివరకు ప్రత్యామ్నాయన్ని ఏర్పాటు చేయాలని ఐసిడిఎస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రోహిత్, పంచాయతీ కార్యదర్శి బక్క మహేష్, మాజీ ఉపసర్పంచ్ మొగుళ్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -