నవతెలంగాణ – తొగుట
రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలలో విద్యార్థులు తృతియ స్థానం సాధించడం గర్వంగా ఉందని ప్రధానోపాధ్యాయులు అంజలి, మండల విద్యా ధికారి కె. నర్సయ్య అన్నారు. గురువారం మండ లంలోని గణపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలలో తృతియ స్థానం సాధించిన సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కాందా ఐఏఎస్ వారది ఇండియా పౌండే షన్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలలో మా గణపురం విద్యార్థులు పాల్గొన్నా రు. ఈ పోటీలలో రాష్ట్రం లోని 33 జిల్లాల విద్యా ర్థులు పాల్గొన్నారని తెలిపారు. అందులోని మన పాఠశాల విద్యార్థులు జి. నిహారిక, కె. ప్రణయ్ రిత్విక, జి. భవ్య శ్రీ తృతీయ స్థానం సాధించి, రూ. 27వేలు బహుమతి సాధించడం గర్వ కారణం అన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు సహకరించిన నవీన్ కుమార్ ను అభినందించారు. విద్యార్థులను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అభినందించారని తెలిపారు. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలలో గణపురం విద్యార్థులు తృతియ స్థానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



