సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ
నవతెలంగాణ – భువనగిరి
నవంబర్ 8వ తేదీన రామన్నపేటలో జిల్లా నాలుగో మహాసభలు ప్రతినిధులు పాల్గొనాలని జిల్లా సీఐటీయూ సహాయ కార్యదర్శి మాయ కృష్ణ కోరారు. శుక్రవారం జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా మార్చి కార్మిక శక్తిని నిర్వీర్యం చేసింది అన్నారు. సంపదను ఉత్పత్తి చేసే కార్మికులు సమ్మె చేసుకునే సమ్మె చేసే హక్కు లేకుండా సంఘాలు పెట్టి హక్కు లేకుండా కార్మికుల బాగోగులు చూడవలసిన లేబర్ అధికారులను నిమిత్త మాత్రులుగా చేసిందన్నారు. ఫలితంగా కార్మికులు బానిసల్లాగా పని చేయవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. కార్మిక శ్రమను పెట్టుబడిదారులకు దోచిపెడుతుంది నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చినంక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కారు చౌకగా అంబానీ అదానిలకు అమ్మివేస్తున్నారన్నారు.
దేశ సంపదను దోచిపెడుతూ ఇంకొక వైపు దేశభక్తి ముసుగులో మతోన్మాద ఎజెండాను ముందుకు తెచ్చి మతాల మధ్యన చిచ్చు పెడుతుందన్నారు. కార్మిక లోకాన్ని అనైక్యత గురిచేస్తుంది ఈ విధానాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారన్నారు. మన రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రజల మోసం చేస్తుంది సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వము నియంతృత్వ పోకడలకు విసిగిన జనము మార్పు కోరుకున్నారన్నారు. ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ఫలితంగా సమ్మెలు అంటే అణచివేసే అణచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వము ఆలోచనను ఏ మాత్రం తేడా లేకుండా అమలు చేయుచున్నారన్నారు. ఈ విధానాలను తిప్పి కొట్టవలసిన బాధ్యత కార్మిక వర్గంపై ఉన్నది ఈ కార్యక్రమంలో పట్టణ సిఐటియు కన్వీనర్ గంధ మల్ల మాతయ్య, కొత్వాల శంకర్, ఉడుత సోములు, వడ్డే నరసింహ, ఎల్లల కృష్ణ, భూషపక రాజు, కాశపాక సతీష్ పాల్గొన్నారు.



