Thursday, May 15, 2025
Homeతెలంగాణ రౌండప్ఆదేశాలను ఉల్లంఘించి..పట్టా మార్పిడి

ఆదేశాలను ఉల్లంఘించి..పట్టా మార్పిడి

- Advertisement -

బదిలి రోజు తహసీల్దార్ నిర్వహాకం
న్యాయం చేయాలని తహాసీల్ వద్ద బాధిత కుటుంబ సభ్యుల బైఠాయింపు
బాధితుల అందోళనకు సీపీఐ నాయకుల మద్దతు
నవతెలంగాణ – బెజ్జంకి
: ఎస్సీ, ఎస్టీ కమీషన్, కలెక్టర్, ఆర్డీఓ అధేశాలను ఉల్లంఘించి తమ వ్యవసాయ సాగు భూమిని రెడ్డి సామాజిక వర్గానికి తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి బదిలి రోజు పట్టా మార్పిడి చేసి అన్యాయం చేశాడని, జిల్లాధికారులు స్పందించి న్యాయం చేయాలని మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన బాధిత కాంపెళ్లి మల్లయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం మండల కేంద్రంలోని తహాసీల్ అవరణం ముందు బైఠాయించి అందోళన నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులు చేపట్టిన అందోళనకు మండల సీపీఐ నాయకులు మద్దతు తెలిపి దళిత సామాజిక వర్గాలను అణచివేసి మామూళ్లతో రెడ్డి సామాజిక వర్గానికి పట్టా మార్పిడి చేసిన తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిపై శాఖపరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరును డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత కాంపెళ్లి మల్లయ్య కుటుంబ సభ్యులు అవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల అదేశాలను పాటిస్తానని తహసీల్దార్ నమ్మబలికి, బదిలి రోజు సర్వేనంబర్ 874 ఏ/1 యందు సుమారు 0.35 ఎకరాల వ్యవసాయ సాగు భూమిని మోకాపైలేని రెడ్డి సామాజిక వర్గానికి తహసీల్దార్ పట్టా మార్పిడి చేసి వెళ్లిపోయాడన్నారు. మొదట ఆర్ఐ సంతోష్ ను క్షేత్రస్థాయి విచారణకు పంపించి, కొద్ది రోజుల అనంతరం దళితులమనే అక్కసుతోనే రెడ్డి సామాజిక వర్గానికి కొమ్ముకాసి తహాసీల్దార్ మరో ఆర్ఐతో కార్యాలయంలోనే విచారణ రికార్డులను తారుమారు చేయించి పట్టా మార్పిడి చేశారన్నారు. మా వ్యవసాయ సాగు చుట్టుపక్కల ఉన్న రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన రైతులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కమీషన్, కలెక్టర్, ఆర్డీఓ అధేశాలను ఉల్లంఘించి పట్టా మార్పిడి చేసిన తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కలెక్టరును విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -