Friday, May 16, 2025
Homeఆదిలాబాద్దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో జరిగిన ఘటనలో దళితుల పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని నాగార్జున నగర్ లో దళిత సంఘాల నాయకులు, బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. బోరిగాం గ్రామంలో బుద్ద విగ్రహం ను అదికారులు తొలగించటం సరికాదని అన్నారు. వేంటనే అదే స్థలంలో బుద్ద విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దాడిలో గాయపడ్డ మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని వారు కోరారు. ఈఘటనలో అరెస్టు అయిన దళితులను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమతా  సైనిక్ దళ్  ఉపాధ్యక్షుడు నారాయణ వాగ్మరే, భీంఆర్మీ నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షుడు హౌజేకర్ ప్రకాష్, సమతా సైనిక్ దళ్ మధోల్ మండల అధ్యక్షుడు విశ్వంబర్, నాయకులు శ్రావణ్, శంకర్, గంగాధర్, కిర్తిరత్న, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -