నవతెలంగాణ – జోగులాంబ గద్వాల: గద్వాల పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకును బిజ్వారం గ్రామానికి తరలిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు క్రింద అమరవాయి, సద్దలోన్పల్లి, మంగంపేట, నేతివానిపల్లి, బూడిదిపాడు గ్రామాల రైతులు గద్వాల పట్టణంలోని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో లావాదేవీలు చేస్తుంటారు. మారుమూల గ్రామమైన బిజ్వారముకు బ్యాంకును తరలిస్తే రైతుల రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుందని రైతులు తెలిపారు. రైతుల పంట రుణాలు ఇతర రుణాలు పొందేందుకు ఇబ్బందిగా మారుతుందన్నారు. బ్యాంకు ఉన్నతాధికారులు పరిస్థితిని గమనించి గద్వాలలోనే తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో బ్యాంకు ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
గ్రామీణ బ్యాంకును తరలించవద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



