Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం

జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం

- Advertisement -

బోరబండలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
నవతెలంగాణ – నకిరేకల్ 

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయమని శాలిగౌరారం మండల కాంగ్రెస్ నాయకులు ఎర్ర సుధాకర్ అన్నారు. శనివారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆదేశానుసారం బోరబండ డివిజన్ లో నవీన్ యాదవ్ గెలుపు కోసం శాలిగౌరారం మండల కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచార నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవీన్ యాదవ్ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ,అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉంటున్నాడని, నవీన్ యాదవ్ కి బడుగు బలహీన వర్గాల పూర్తి మద్దతు ఉంటుందనిన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తుంచుకొని  ఈనెల 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని  కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కోక శ్రీను, కోక సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -