నవతెలంగాణ – తొగుట
రవీంద్ర భారతిలో చేసిన నృత్యప్రదర్శనతో అందరి మన్ననలు పొదడం సంతోషంగా ఉందని వెంకట్రావు పేట పాఠశాలలో ఉపాధ్యాయులు ఐ. మురళీధర్ తెలిపారు. శనివారం అయన విలేకరు లతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బాషా, సాంస్కృతిక శాఖ, డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అఖిల భారత సివిల్ సర్వీసెస్ విభాగం వారు 2025 సంవత్సరానికి గాను 6, 7 తేదీలలో హైదరాబాద్ రవీంద్ర భారతి లో సంగీతం, నృత్యం, నాటక ప్రదర్శనలు కార్య క్రమం ఏర్పాటు చేశారాని అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా పాటల ప్రదర్శనకు అనుమతిలేదని నిర్వాహకులు వివరించారని చెప్పారు.
అన్ని విభాగాలు కలిసి వివిధ శాఖలలో పనిచేస్తున్న సుమారు 300 మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని తమ కళను ప్రదర్శించారని తెలిపారు. ఈ పోటీలలో మండలంలోని వెంకట్రావు పేట పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న నాకు అవకాశం లభించిందని అన్నారు. అందులో శివ స్తోత్రం పాట తాండవం, లాస్యం కలయికతో రౌద్రం, కరుణ, అద్భుత రసాలతో చేసిన శాస్త్రీయనృత్యం జడ్జిలను, ప్రేక్షకులను ఆకట్టుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో న్యాయనిర్ణేతలతో ప్రశంస లు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నా రు. వెంకటరావుపేట ఉన్నత పాఠశాల ప్రధా నోపాధ్యాయులు నయీమ కౌసర్, ఉపాధ్యాయ బృందం మురళీధర్ ను అభినందించారు.



