నవతెలంగాణ – జన్నారం
గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు నదిలో వరద ప్రవాహంలో కొట్టుకపోయిన సంఘటన జన్నారంలో చోటుచేసుకుంది. మండలంలో బాదంపల్లగోదావరి నదిలో స్నానానికి వెళ్లిన జన్నారం మండలంలోని పొనకల్ గ్రామానికి చెందిన గుండ శ్రావణ్ (33 ) స్నానం చేస్తుండగా గోదావరి ఒకేసారి ప్రవాహం అధికంగా రావడంతో నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. శ్రావణ్ కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. నానమ్మ సంవత్సరిక కార్యక్రమం శుక్రవారం ముగించుకుని శనివారం ఉదయం గోదావరి స్నానానికి వెళ్ళి స్నానం చేసిన అనంతరం తన మిత్రునికి తన ఫోన్ లో ఫొటో తీయమని ఇచ్చి, ఫొటో దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ గోదావరిలో పడిపోయాడు. మృతునికి ఇంకా వివాహం కాలేదు. గల్లంతైన మృతదేహం ఆచూకీ కోసం స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష ఆధ్వర్యంలో పోలీసులు, ఫైర్ శాఖ అధికారులు, గజ ఈతగాళ్లతో వెతుకుతున్నారు. ఇంకా అమృతదేహం లభ్యం కాలేదని ఎస్ఐ అనూష తెలిపారు.
గోదావరి నదిలో యువకుడు గల్లంతు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



