నవతెలంగాణ – వెల్దండ
మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామ పంచాయితీ పరిధిలోని గొల్లోనిపల్లి శివారులో 237 సర్వేనెంబర్ లో 10 ఎకరాల 6 గుంటల భూమి పై సర్వహక్కులు మావేనని గోల్లోనిపల్లికి చెందిన రైతులు డేరంగుల సత్యనారాయణ, వెంకటయ్య, సాలయ్య, సత్తయ్య, యాదయ్య, యాదమ్మ, చిన్న జంగయ్య లు పేర్కొన్నారు. శనివారం వెల్దండ పోలీస్ స్టేషన్ లో రైతులు తమ భూమిని రక్షించాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మా తాతల కాలం నుంచి వచ్చిన భూమిపై వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, ప్రభుత్వ రికార్డులలో తరతరాలుగా తమ పైనే ఉన్నాయన్నారు. మా గ్రామానికి చెందిన కొందరు, ఇతర గ్రామాలకు చెందిన వారు కొందరు కలిసి, తప్పుడు పత్రాలు సృష్టించి భూములను లాక్కోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాభూమి చుట్టూ ఉన్న కడీలను ధ్వంసం చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మా భూమి జోలికి వస్తే అందరం కలిసి ఆత్మ హత్య చేసుకుంటామని తెలిపారు.
కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలని ఫిర్యాదు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



