Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై పోరాడాలి..

అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై పోరాడాలి..

- Advertisement -

అంగన్వాడి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి 
నవతెలంగాణ – నకిరేకల్ 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంబిస్తున్న ఐసిడిఎస్ వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు అంగన్వాడీల సిద్ధంగా ఉండాలని అంగన్వాడీల యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని విష్ణు ఫంక్షన్ హల్ లో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా 5వ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పతాకాన్ని  ఆవిష్కరించి అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మహాసభల్లో ప్రభుత్వాల విధానాలపై చర్చించి సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో నిర్వహించే పోరాటాల భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకునేందుకు ఈ మహాసభలు వేదిక కానున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేయడానికి నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని అందులో భాగంగా పిఎంసి స్కూళ్లను తీసుకొచ్చి అంగన్వాడీలకు పోటీగా నిలిపిందన్నారు. ప్రతి బడ్జెట్ లో ఐసిడిఎస్ కు నిధులను తగ్గిస్తూ నిర్వీర్యానికి పాల్పడుతుందని విమర్శించారు.

ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే రూ. 18 వేల వేతనం చెల్లిస్తామన్న హామీ మరిచిందన్నారు. అంగన్వాడి హక్కుల సాధన కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని అపోరాటాల్లో అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం కార్మికుల ఫై పెద్ద ఎత్తున దాడి చేస్తుందన్నారు., 24 కార్మిక చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్ లు తీసుకురావడం వల్ల కార్మికుల హక్కులు హరిస్తాయన్నారు.

పనిగంటలు 8 నుండి 10 గంటలకు పెరుగుతాయని, కనీస వేతనాలకు సమ్మె చేసే హక్కు కోల్పోతామని, పని భారం పెరుగుతుందని ఈ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో సంఘటితంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభల అధ్యక్ష వర్గంగా పొడిచేటి నాగమణి, ఇంద్రకంటి సైదమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు  ఎండి సలీం, సిఐటియు నాయకులు లకపాక రాజు వంటపాక వెంకటేశ్వర్లు, అవుట రవీందర్, శ్రామిక మహిళా రంగం జిల్లా కార్యదర్శి భూలక్ష్మి, యూనియన్ కార్యదర్శి బి. పార్వతి, దాడి అరుణ, సునంద, సముద్రమ్మ, పద్మ, రాధాబాయ్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -