Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదవాలి

ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యంతో చదవాలి

- Advertisement -

చదువుతోనే సమాజ మార్పు 
పదో తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులు 
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని, చదువుతోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని K.S ఫంక్షన్ హాల్ నందు శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్  ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు నిర్వహించిన మోటివేషన్ తరగతుల  కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా  హాజరయ్యారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ .. గద్వాల నియోజకవర్గంలో విద్యార్థిని, విద్యార్థులు  చదువుకోవాలని, చదువుతూనే ఏదైనా సాధ్యమవుతుందనీ, చదువు వల్ల మనకు జ్ఞానం పెరుగుతుందన్నారు.  గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు ప్రతి ఒక్కరు చదువుకోవాలని వారి తల్లిదండ్రులు విద్యార్థులకు పాఠశాలకు పంపాలి.  ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతాలలో  ఇప్పుడిప్పుడే కొంత ప్రజలలో చైతన్యం చైతన్యం రావడం జరిగింది. ప్రతి ఒక్క వారి పిల్లలను మంచిగా చదువు ఆలోచించడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత మైన విద్యను అందించడం జరుగుతుంది. అదేవిధంగా అత్యున్నత విద్యకు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా గద్వాల లోని  గురుకుల పాఠశాలలు, ఇంటర్ , డిగ్రీ, పీజీ పాలిటెక్నిక్, మెడికల్ నర్సింగ్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. అన్ని రకాల విద్య కోర్సులను కూడా గద్వాలలో తీసుకురావడం జరిగింది.

ప్రతి ఒక్క విద్యార్థి ఇతర ప్రాంతాలకు వెళ్లే చదువుకునే పరిస్థితి లేకుండా అన్ని సదుపాయాలను కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. గద్వాల చదువుకొని భవిష్యత్తులో అత్యంత స్థాయికి ఎదగాలి కోరారు.విద్యార్థులకు మోటివేషన్ అవగాహన ఎంతో అవసరమని  చదువుతోపాటు సమాజంలో జరుగుతున్న విషయాల పైన కూడా అవగాహన కలిగి ఉండాలి అని పేర్కొన్నారు.

విద్యార్థులు ఒక ఉన్నతమైన లక్ష్యంతో భవిష్యత్తును నిర్ణయించుకోవాలి పదో తరగతి నుండి జీవితంలో ఇంటర్ దశలో మలుపు తిరుగుతుంది. కాబట్టి విద్యార్థులు చదువుపై శ్రద్ధ ఏకాదతలతో చదువుకోవాలి చదువుకోవడం వల్లనే మన జీవితం బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి మొబైల్ ఫోన్లను ఉపయోగించరాదు. ఇంత అవసరమో అంత మీరకే ఉపయోగించాలి దానివల్ల మనకు ఎంతో నష్టం జరుగుతుంది. అదేవిధంగా చెడు వ్యసనాలకు బానిస కాకూడదు మంచి దారిలో నడవాలి మంచి బంగారు భవిష్యత్తు వైపుగా అడుగులు వేయాలని తెలిపారు. జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత శాతం   సాధించి  గద్వాల నియోజకవర్గం, మీ తల్లిదండ్రులకు మీ పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు కోరారు.

ప్రతి ఒక విద్యార్థికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు మాజీ  ఎంపీపీ విజయ్, నాయకులు మైలగడ్డ చంద్రశేఖర్, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాబు నాయుడు, గౌరవాధ్యక్షుడు బీచుపల్లి, వివిధ పాఠశాల కరస్పాండెంట్స్, ఉపాధ్యాయులు , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -