నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ రిపైర్ షెడ్ లోని కారును, కామారెడ్డి లోని వివిధ ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడి బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్ లను అపహరించిన నిందితులను అరెస్టు, రిమాండ్ కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. తేదీ 31.10.2025 రోజున చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో పాత నేషనల్ హైవే -7 రోడ్డు పక్క ఉన్న ఆటో ఎలక్ట్రికల్ షాపు (రేకుల షెడ్డు) లో గుర్తు తెలియని వ్యక్తులు రేకులను తొలగించి షెడ్ లోపలకి చొరబడి షెడ్డు నుండి కారు, వెహికిల్ స్కాన్నర్స్, బ్యాటరీలు, ఏసి ప్యానెల్, సీసీటీవీ హార్డ్ డిస్క్ లను దొంగిలించినారని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారoభిచడం జరిగిందన్నారు.
ఈ కేసు, ఇటీవలా దేవనపల్లి పోలీసు స్టేషన్, కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ల పరిదిలో జరిగిన కొన్ని దొంగతనాల నేరస్తులను పట్టుకోవడానికి ఆదేశాలు ఇవ్వగా కామారెడ్డి ఎఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో 1)కామారెడ్డి రూరల్ సిఐ రామన్, 2) సిసిఎస్ సిఐ శ్రీనివాస్, 3) దేవునిపల్లి ఎస్ఐలు రంజిత్, భువనేశ్వర్, 4) సిసిఎస్ ఎస్ఐ ఉస్మాన్ లలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి సీసీటీవీ కేమరాల ద్వారా, ఇతర సాంకేతిక సమాచారం ఆధారంగా శనివారం తేది 08.11.2025 నా నర్సన్నపల్లి కమాన్ దగ్గర మరలా నేరం చేద్దామని అనుమనస్పదముగా తిరుగుతుండగా నిందితులను చాకచక్యంగా పట్టుకొని విచారించగ వారు మన జిల్లాలోని దేవునిపల్లి, కామారెడ్డి, సదాశివనగర్, భిక్కనూర్ పిఎస్ పరిధిలో నిందితులు చేసిన 15 దొంగతనాలను ఒప్పుకోవడం జరిగింది.
నిజామాబాద్ లోని రెంజల్, నిర్మల్ జిల్లాలోని బాసర పోలీస్ స్టేషన్ ల పరిదిలో నేరాలు చేసిన విషయాలు బయటపడ్డవి కావున వారిని అరెస్ట్ చేసి కోర్ట్ ముందు హాజరు పరచడం జరుగుతుందన్నారు. నిర్మల్ జిల్లా, తానూరు మండలం, భామిని గ్రామానికి చెందిన షేక్ రఫీక్ , మెదక్ జిల్లా, చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ , నిర్మల్ జిల్లా తాండూరు మండలం భామిని గ్రామానికి చెందిన షేక్ ఖయ్యుమ్, మహబూబాబాద్ టౌన్ బాబా గుట్ట కాలనీకి చెందిన బండారి అశోక్, ఐదవ ముద్దాయి అయినా నిర్మల్ జిల్లా తాండూర్ మండలం భామణి గ్రామానికి చెందిన షేక్ అజ్జు వీరి నుండి ఒక కారు, 3 బైక్ లు, 2 స్పానర్ లు, 3 ఇనుప రాడ్ లు, ఒక సుత్తె, స్క్రూ డ్రైవర్ టైప్ వెపన్, డీజిల్ క్యాన్, 1 వాహన డయగ్నస్టిక్ స్కానర్, 4 మొబైల్ ఫోన్లు ఆ దిన చేసుకోవడం జరిగిందని, ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించడంలో కామారెడ్డి రూరల్ సి.ఐ ఎస్. రామన్, సి.సి.ఎస్ సి.ఐ శ్రీనివాస్, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సైలు రంజిత్, భువనేశ్వర్, సిసిఎస్ ఎస్ఐ ఉస్మాన్, ప్రవీన్ ఎస్సై ( ఎఫ్ పి బి ) హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సి.సి.ఎస్ సిబ్బంది కిషన్, రాజవీర్ (హెచ్‌సీ), గణపతి, లక్ష్మీకాంత్, రవి, స్వామి, శ్రీనివాస్, మైసయ్య, శ్రావణ్ కుమార్, రాజేంద్ర కుమార్, అలాగే దేవునిపల్లి పిఎస్, హెచ్‌సీ కృష్ణారెడ్డి, పీసీలు రవికిరణ్, రాము లు చూపిన సమన్వయం, చురుకుదనం నిబద్ధతకు అభినందించడం జరిగిందన్నారు.



