Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు 

ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండల స్థానిక పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు.‌ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం అందిస్తున్న ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గోపాల్ నాయక్, మండల సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, తోటకూరి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్, యూత్ ఉపాధ్యక్షులు ఆవుల మహేష్, చిలుక సంపత్, పోచంపల్లి మాజీ ఎంపీటీసీ సోమన్న, మాజీ ఉపసర్పంచ్ శేఖర్, సోమ నర్సయ్య, పంతులు నాయక్, రవి, కందుల యాకయ్య, జాటోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -