Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాలలు ఛలో ఢిల్లీ తరలిరావాలి 

మాలలు ఛలో ఢిల్లీ తరలిరావాలి 

- Advertisement -

జాతీయ మాల మహానాడు నియోజకవర్గ ఇన్చార్జి అరె కిషోర్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

దళితుల హక్కులు ,మాలలు,మాల కులాల అనుబంధ ఉపకులాల సమస్యలపై రాజ్యాంగ హక్కుల సాధన కై  నవంబర్ 25,26 తేదీలలో ఢిల్లీలో చేపట్టే నిరసన కార్యక్రమానికి మాలలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని జాతీయ మాల మహానాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆరే కిషోర్ పిలుపునిచ్చారు. శనివారం హుస్నాబాద్ లో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ కరపత్ర ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో మాల, మహార్ అనుబంధ కులాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. శాస్త్రీయమైన లెక్కలు లేకుండా చేసిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, రోస్టర్ జీవో నెం. 99, జీవో నెం. 29 రాజ్యాంగ వ్యతిరేకం తక్షణమే పునః సమీక్షించాలన్నారు.

(నవంబర్ 25న ఢిల్లీలో నిరసన) ప్రైయివేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం తీసుకురావాలని తెలిపారు.ఎస్సీ రిజర్వేషన్ల శాతాన్ని 15% నుండి 20% శాతానికి పెంచాలన్నారు. దళితులపై దాడులను అరికట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే అంశాల కోసం రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మీడియా సెల్ కన్వీనర్ జాల శ్రీనివాస్, జై భీమ్ సైనిక్ దళ్ హుస్నాబాద్ మండల అధ్యక్షులు దుంద్ర సుమన్, అక్కన్నపేట మండల బాధ్యులు గిరిమల గిరిప్రసాద్, కోహెడ మండల నాయకులు పాక శ్రీనివాస్, హుస్నాబాద్ మండలం నాయకులు సావుల రమేష్,డ్యాగల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -