Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
దేశంలో మహిళలపై, జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని ఐద్వా పట్టణ సహాయ కార్యదర్శి మాటూరు కవిత అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలోని మీనా నగర్ లో ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో  ఎన్ని చట్టాలు ఉన్నా ఏదో ఒక రూపంలో మహిళల పైన తీవ్రమైన దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. మహిళల పైన వేధింపులు అత్యాచారాలు హింస వంటివి సమాజాన్ని సవాలు చేస్తున్నాయని అన్నారు. మేజర్లైన యువతి యువకులు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును కాలరాస్తూ కుల దుహంకార హత్యలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయని తెలిపారు. మీడియాలో స్త్రీలను అసభ్యంగా, అశ్లీలంగా క చిత్రీకరించడంతోపాటు, అందాల పోటీల పేరుతో ఆమెను మార్కెట్ సరుకుగా దిగజారుస్తున్నారని అన్నారు. సమాజంలో స్త్రీలు బాలికల పైన హింస అత్యాచారాలు ఆగాలంటే కఠినమైన చట్టాలతో పాటు సామాజిక వ్యవస్థలు మార్పు రావాలని అన్నారు. 2026 జనవరి 25-28 వరకు హైదరాబాదులో జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని మహిళా లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకురాలు హిరేకార్ మౌనిక, లావణ్య, విద్య, శారద, శైలజ, అస్మా బేగం లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -