Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి

సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి

- Advertisement -

ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ 
నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు స్వచ్చందంగా ముందుకు రావాలని ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా, పోలీస్ స్టేషన్ సమీపంలో 6 సీసీ కెమెరాలను శనివారం ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో దొంగలు, కేటుగాళ్లు కొత్త తరహాలో దొంగతనాలు, మోసాలు, నేరాలకు పాల్పడుతున్నారన్నారు.

రోజురోజుకూ అసాంఘిక చర్యలు, అనైతిక చర్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో నిఘా నేత్రాల అవశ్యకత ఎంతైనా అవసరం ఉందన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే పిల్లలు, యువత కూడా క్రమశిక్షణతో ఉంటారని తెలిపారు. దొంగతనాలు, నేరాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నిందితులను సులభంగా పట్టుకోవచ్చన్నారు. కోర్టుల నందు సాంకేతిక ఆధారాలను చూపించవచ్చనని తెలిపారు. కాలనీల్లో, దుకాణం, వ్యాపార సముదాయాలు, భవన సముదాయాలు, నివాస గృహాలు తదితర వాటిల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. పోలీస్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -