Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు 

ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట 
మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ వద్ద గల ఇందిరమ్మ విగ్రహం వద్ద శనివారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు గణపాక సుధాకర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  జన్మదిన వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్  విచ్చేసి ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జన్మదినం సందర్భముగా కేకును కట్ చేసి మండల ప్రజానీకానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాణా సంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పెండెం శ్రీకాంత్ మాట్లాడుతూ టిపిసిసిగా ఉన్న రేవంత్ రెడ్డి ని మాజీ సీఎం కెసిఆర్ గత అనేక ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేశారు. గత పడేండ్ల దొరల పాలన అవినీతి అక్రమాలను అంతమొందించి ముఖ్యమంత్రిగా ఎదిగిన రేవంత్ రెడ్డి ని అభినందించారు. రేవంత్ రెడ్డి  ప్రవేశ పెడుతున్న సంక్షేమాలు ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీ, ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్, రెండు లక్షలు రుణమాఫీ, వరి క్వింటాకు 500 బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఎస్సీ వర్గీకరణ, మహిళ సంఘాలకు పెట్రోల్ బంకులు, మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, ఇందిరా మహిళా కాంటీన్లు, సోలార్ విద్యుత్ యూనిట్లు, హైడ్రా, ఈగల్, చెరువులు సుందరికరణ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 30సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్, 2లక్షల కోట్లు విదేశీ పెట్టుబడులు, 82 వేల ఉద్యోగ ఉపాధి కల్పన, ఫ్యూచర్ సిటీ, సాగు నీరు, త్రాగు నీరు, గ్రామ గ్రామాన సిసి రోడ్లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాలనలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కొనియాడారు.

ఇది కదా కాంగ్రెస్ ప్రజ పాలన సంక్షేమం అంటే జైయహో కాంగ్రెస్ పార్టీ, జయహో రేవంతన్న అంటూ నినాదాలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో  మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -