నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ రైతు సంఘం దామరచర్ల మండల ప్రధాన కార్యదర్శిగా గోలి వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. ఇటీవల మండల కేంద్రంలో జరిగిన ఆ సంఘం మహాసభలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వెంకటరెడ్డి మాట్లాడుతూ .. మండలంలో రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రధానంగా రైతులు పండించిన పంటకు మద్దతు ధర అందేలా తమ వంతుగా ఉద్యమాలు చేస్తామన్నారు. వ్యవసాయాన్ని కాపాడే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అకాల వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని పత్తి పంటను ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. నేలకొరిగిన వరి పంట రైతులకు ప్రభుత్వం పరిహారమిచ్చి ఆదుకోవాలని అన్నారు. రైతు సంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానన్నారు. ఆయన నియమకం పట్ల పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు.
రైతు సంఘం దామరచర్ల మండల కార్యదర్శిగా వెంకట్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



